అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Eklavya Model School | ఇందల్వాయి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Eklavya Model School | పాఠశాల నిర్వహణలో లోటుపాట్లు ఉంటే..
పాఠశాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వాటిని కప్పిపుచ్చకుండా వాస్తవ పరిస్థితులను తన దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. సమస్యలను ముందుగానే గుర్తించి, వాటికి తక్షణ పరిష్కారం చూపే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, శారీరక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. భోజన పదార్థాల నాణ్యతను ప్రతిరోజూ పరిశీలించాలని ఆదేశించారు.
Eklavya Model School | విద్యార్థులకు వైద్యపరీక్షలు..
విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అనారోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులను వెంటనే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇన్ఛార్జి డీఈవో సాయాగౌడ్, ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Midday Meal Menu | మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి..ఎమ్మెల్యే ధన్పాల్