Vision Board Studio ISO | అంతర్జాతీయ విస్తరణ దిశగా విజన్ బోర్డ్ స్టూడియో కీలక అడుగు..

ఆభరణాలు, లగ్జరీ రిటైల్ డిజైన్ , విజువల్ మర్చండైజింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన విజన్ బోర్డ్ స్టూడియో (వీబీఎస్ - VBS) మరో కీలక మైలురాయిని అందుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vision Board Studio ISO | ఆభరణాలు, లగ్జరీ రిటైల్ డిజైన్ , విజువల్ మర్చండైజింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన విజన్ బోర్డ్ స్టూడియో (వీబీఎస్ – VBS) మరో కీలక మైలురాయిని అందుకుంది. క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఐఎస్ఓ 9001:2015 (ISO 9001:2015) ధ్రువీకరణను ఈ సంస్థ సొంతం చేసుకుంది. త్వరలోనే యూరప్ ( Europe )మార్కెట్లోకి విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో లభించిన ఈ గుర్తింపు సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

Vision Board Studio ISO | అంతర్జాతీయ ప్రమాణాలు..

2011లో అదితి కొటక్ స్థాపించిన విజన్ బోర్డ్ స్టూడియో ముంబై ప్రధాన కేంద్రంగా, దుబాయ్‌లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సృజనాత్మక కాన్సెప్ట్‌ల రూపకల్పన, డిజైన్, తయారీ నుంచి క్షేత్రస్థాయిలో ఇన్‌స్టాలేషన్ వరకు అన్ని ప్రక్రియల్లో వీబీఎస్ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు ఐఎస్ఓ ధ్రువీకరణ స్పష్టం చేసింది. స్టోర్ ముఖభాగాలు, ఆకర్షణీయమైన విండో డిస్‌ప్లేలు, ప్రత్యేక ప్రాప్స్, ప్రచార కార్యక్రమాల ఏర్పాట్లు వంటి సేవలన్నింటినీ ఒకే వేదికపై అందిస్తూ బ్రాండ్లకు వినూత్న రూపాన్ని ఇస్తోంది.

Vision Board Studio ISO | సృజనాత్మక ప్రస్థానం..

విజన్ బోర్డ్ స్టూడియో తన వినూత్న పనితీరుతో 2024 నుంచి ఇప్పటివరకు ప్రముఖ వేదికలపై మొత్తం 8 ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. వీటిలో 2024, 2025 సంవత్సరాల్లో వరుసగా వీఎంఆర్‌డీ (VMRD) అవార్డ్స్‌లో ‘బెస్ట్ విండో డిస్‌ప్లే’ పురస్కారాలు, 2026లో ‘ఫెస్టివ్, సేల్ అండ్ ఈవెంట్స్ విండో డిస్‌ప్లే’ అవార్డు ఉన్నాయి. వీటితో పాటు ఇండియాస్ కూలెస్ట్ స్టోర్ అవార్డులు (2024, 2025), ఈ4ఎం రిటైల్ ఎక్సలెన్స్ అవార్డులు (2025, 2026) , జ్యువెలర్స్ గిల్డ్ అవార్డులను కూడా వీబీఎస్ కైవసం చేసుకుంది.

Vision Board Studio ISO | మార్కెట్ విస్తరణే తదుపరి లక్ష్యం..

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు అదితి కొటక్ మాట్లాడుతూ.. సాధారణ ప్రదేశాల్లోనూ అసాధారణ అవకాశాలను వెతకడమే డిజైన్ అని అభివర్ణించారు. విజువల్ మర్చండైజింగ్ అంటే కేవలం అందమైన అలంకరణ మాత్రమే కాదని, వినియోగదారుల మనసులో బ్రాండ్ గుర్తింపును చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దడమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్, జీసీసీ (GCC) దేశాల్లో సేవలందిస్తున్న తాము, త్వరలోనే యూరప్ మార్కెట్లోకి అడుగుపెడుతూ ప్రపంచవ్యాప్త లగ్జరీ బ్రాండ్లకు విశ్వసనీయ భాగస్వామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Telangana Fancy Number Rules | వాహనదారులకు అలర్ట్.. ఫ్యాన్సీ నంబర్ల గడువు 30 రోజులకు తగ్గింపు..

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *