Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన.. తుది నివేదికకు రంగం సిద్ధం!

విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం కూలిన ప్రాంతంలో భూమిపై ఉన్న మరో 19 మంది సామాన్యులు కూడా దుర్మరణం పాలయ్యారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India plane crash | దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని, త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను బహిర్గతం చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.

Air India plane crash | అసలేం జరిగిందంటే..

2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోయింది. 2025లో జరిగిన ఈ ఘోర విమాన దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Air India plane crash | 260 మంది దుర్మరణం

ఈ పెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం కూలిన ప్రాంతంలో భూమిపై ఉన్న మరో 19 మంది సామాన్యులు కూడా దుర్మరణం పాలయ్యారు. మొత్తం 260 మందిని బలిగొన్న ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Air India plane crash | త్వరలోనే అసలు కారణాలు వెలుగులోకి

ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా కేంద్రం తాజా అప్‌డేట్ ఇచ్చింది. దర్యాప్తు ప్రక్రియ దాదాపు పూర్తయిందని, విమానం కూలిపోవడానికి గల కచ్చితమైన సాంకేతిక, ఇతర కారణాలతో కూడిన తుది నివేదికను త్వరలోనే సమర్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీంతో ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణమేంటో త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *