అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajagopal Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన రూ.10 లక్షల కోట్ల భూములు దోచుకున్నారని ఆరోపించారు.
రాజగోపాల్‌రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. సీఎం (CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టం కలిసి వచ్చి సీఎం అయ్యావని రేవంత్‌రెడ్డిని అన్నారు. తాజాగా మరోసారి మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిధిలో ఉన్న రూ.10 లక్షల కోట్ల ప్రభుత్వ భూములను లిటిగేషన్ నుండి తొలగించి ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం భూ కబ్జాలు, చీకటి వ్యవహారాల వల్ల కాంగ్రెస్ పార్టీకి అంతులేని నష్టం కలుగుతుందన్నారు.
Rajagopal Reddy | అధిష్టానం సీరియస్
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం రిపోర్టు అడిగింది. రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను అధిష్టానానికి పీసీసీ చీఫ్ పంపారు. కాగా గతంలో సీఎంపై కొండా సుష్మిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తల్లి కొండా సురేఖ మంత్రి పదవిని తొలగించారు. తాజాగా రాజగోపాల్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి..: Welfare Schemes | సంక్షేమమే ధ్యేయంగా ముందుకు : మంత్రి పొన్నం ప్రభాకర్