అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rekha Naik ED Raids | ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఉదయం రెండు చోట్ల తనిఖీలు చేశారు.
రేఖానాయక్‌కు రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే వాటిలో సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టినట్లు గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తాజాగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. సత్తెనపల్లి (Sattenapalli)లోని రేఖా నాయక్‌కు చెందిన ‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయం అయింది. రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసు నేపథ్యంలో ఈడీ సోదాలు చేపట్టాయి. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గతంలోనే పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. గతంలోనే రేఖా నాయక్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 316(2), 316(5), 318(4), నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు చేశారు.
Rekha Naik ED Raids | భారీగా బలగాలు
ఇంట్లో రేఖా నాయక్‌తో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇంటి సమీపానికి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. ఇంటి చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
ఇది కూడా చదవండి..: Telangana Cold Wave | భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి