అక్షరటుడే, వెబ్‌డెస్క్: NTPC Jobs 2026 | కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఎన్టీపీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్లాంట్ లలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్
భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య : 250.
రిజర్వేషన్ల వారీగా పోస్టులు : జనరల్ 109, ఈడబ్ల్యూఎస్ 25, ఓబీసీ 39, ఎస్సీ 42, ఎస్టీ 35.
వయో పరిమితి : 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
NTPC Jobs 2026 | అర్హతలు..
మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీ లేదా బీ.టెక్ డిగ్రీ కలిగి ఉండాలి. కనీసం 40 శాతం మార్కులు అవసరం. ఎస్సీ, ఎస్టీ, పీడ్ల్యూబీడీ కేటగిరిలో పాస్ మార్కులు ఉన్నా అప్లై చేసుకోవచ్చు.
పని అనుభవం : కనీసం ఒక సంవత్సరం పవర్ ప్లాంట్ ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్‌లో పని అనుభవం అవసరం. ప్లాంట్ సామర్థ్యం 40 మెగావాట్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
వేతనం : రూ. 55 వేలు. అదనంగా హెచ్ ఆర్ ఏ లేదా కంపెనీ అకామిడేషన్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, మెడికల్ సదుపాయాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
NTPC Jobs 2026 | దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మే 7 మే దరఖాస్తుకు చివరి తేదీ. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఉద్యోగం ఉంటుంది. ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్‌లలో పరికరాల ఆపరేషన్, సేఫ్టీ, మెయింటెనెన్స్ పనులు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.ntpc.co.in లేదా careers.ntpc.co.in లో సంప్రదించగలరు.
ఇది కూడా చదవండి..: Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

