NSE Market Capitalization | ఎన్ఎస్ఈ దూకుడు.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీ గా గుర్తింపు

స్టాక్ ఎక్స్ఛేంజీ లో లిస్టయిన తర్వాత ఎన్ఎస్ఈ జోరుమీదుంది. ఈ క్రమంలో మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా అవతరించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NSE Market Capitalization | 1992 సంవత్సరంలో స్థాపించబడి, 1993 ఏప్రిల్ లో సెబీ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా గుర్తింపు పొందిన ఎన్ఎస్ఈ.. తన కార్యకలాపాలను 1994లో ప్రారంభించింది. హోల్‌సేల్ డెట్ మార్కెట్‌తో మొదలైన దీని ప్రస్థానం..

ఆ తర్వాత స్టాక్స్ కొనుగోలు మరియు అమ్మకాల మార్కెట్‌గా విస్తరించింది. క్రమంగా మార్కెట్ షేరు పెంచుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. ఈ కంపెనీ షేర్లు సెప్టెంబర్ 24న స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి.

NSE Market Capitalization | నాస్‌డాక్, హెచ్ కేఈఎక్స్‌లను వెనక్కినెట్టి..

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా ఆవిర్భవించింది. శుక్రవారం (నవంబర్ 20) నాటి ట్రేడింగ్‌లో కంపెనీ మార్కెట్ విలువ 59.3 బిలియన్ డాలర్ల (రూ.5.5 లక్షల కోట్ల)కు చేరడం ద్వారా ఈ గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఎన్ ఎస్ ఈ అమెరికాకు చెందిన నాస్‌డాక్ హాంగ్‌కాంగ్ కు చెందిన హాంగ్‌కాంగ్ ఎక్స్ఛేంజెస్ అండ్ క్లియరింగ్ (హెచ్కేఈఎక్స్ )లను వెనక్కి నెట్టేసింది.

NSE Market Capitalization | రెండు నెలల్లో రూ. లక్ష కోట్లు..

ఎన్ఎస్ఈ సెప్టెంబర్ 24న దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic stock market)లో లిస్టయ్యింది. ఆ సమయంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.4 లక్షల కోట్లు. లిస్టయిన మొదట్లో షేరు విలువ కొంత ఒడిదుడుకులకు లోనయినా తర్వాత క్రమంగా పుంజుకుంది. సుమారు రెండు నెలల వ్యవధిలోనే లిస్టింగ్ ప్రైస్‌నుంచి 24.5 శాతం పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.1 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.

NSE Market Capitalization | టాప్ 7 లిస్టెడ్ స్టాక్ ఎక్స్ఛేంజీలు..

1. అమెరికాకు చెందిన సీఎంఈ గ్రూప్ మార్కెట్ విలువ 109.6 బిలియన్ డాలర్లు.
2. అమెరికాకే చెందిన ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ విలువ 95.5 బిలియన్ డాలర్లు.
3. జెర్మనీకి చెందిన డాయిచే బోర్స్ విలువ 63.7 బిలియన్ డాలర్లు.
4. యూకేకు చెందిన లండన్‌కు చెందిన లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 60.1 బిలియన్ డాలర్లు.
5. భారత్ కు చెందిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా విలువ 59.3 బిలియన్ డాలర్లు.
6. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌కాంగ్ ఎక్స్ఛేంజెస్ అండ్ క్లియరింగ్ (హెచ్కేఈఎక్స్ ) విలువ 57.7 బిలియన్ డాలర్లు.
7. అమెరికాకు చెందిన నాస్‌డాక్ మార్కెట్ విలువ 57.7 బిలియన్ డాలర్లు.

ఇది కూడా చదవండి..: Stock Market Rally | గ్లోబల్ మార్కెట్లలో సెల్లాఫ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *