TG Safe Raids | ఈ హోటళ్లలో ఫుడ్​ తిన్నారంటే అంతే సంగతులు

హైదరాబాద్​ నగరంలోని 9 హోటళ్లలో టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG Safe Raids | హైదరాబాద్​ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్​లలో వంటలు చేస్తున్నారు. నగరంలోని 9 హోటళ్లలో టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు. కిచెన్​ పరిసరాల్లో గుట్కా మరకలు, బొద్దింకలు, ఎలుకల రెట్టలు, కుళ్ళిన జీడిపప్పు, కృత్రిమ ఆహార రంగులు దర్శనమివ్వడంతో షాక్​ అయ్యారు.

వినియోగదారుల ఫిర్యాదుల మేరకు, పోలీసులతో కూడిన 8 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా హోటళ్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అంతేగాకుండా వంట చేసే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాకాహారం, మాంసాహారం కలిపి నిల్వ చేయడం వంటి విషయాలను గుర్తించారు.

TG Safe Raids | లైసెన్స్​లు రద్దు

నిబంధనలు ఉల్లంఘించిన 4 హోటళ్ల లైసెన్సులను అధికారులు సస్పెండ్​ చేశారు. మాదాపూర్ బావర్చి (అయ్యప్ప సొసైటీ), ది స్పైస్ కిచెన్ (కూకట్‌పల్లి), మతమ్ అల్ యమానీ అరేబియన్ రెస్టారెంట్ (టోలిచౌకి), అన్నపూర్ణ క్యాటరర్స్ (చందానగర్) లైసెన్స్​లను రద్దు చేశారు. అల్ కరీమ్ బేకర్స్ (టోలిచౌకి), శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్ (గౌలిదొడ్డి)లను మూసి వేశారు. 8 ఆహార నమూనాలను సేకరించారు. 135 కిలోల కల్తీ / చెడిపోయిన ఆహారాన్ని ధ్వంసం చేశారు. రాజు గారి బిర్యానీ (చైతన్యపురి), స్వాద్ స్పైసీ (నాగోల్), మరో రెండు హోటళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సస్పెండ్ చేసిన 4 హోటళ్లను వెంటనే డీలిస్ట్ చేయాలని స్విగ్గీ & జొమాటోలను ఆదేశించారు.

దీనిని కూడా చదవండి  : Vemulawada Development | వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *