HYDRAA | చెరువులో 4 ఎకరాల ఆక్రమణ.. నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా

శంషాబాద్ మండ‌లం తొండిప‌ల్లి చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA | రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్ మండ‌లం తొండిప‌ల్లి గ్రామంలోని సంద‌ప‌ల్లి చెరువులో కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం జేసీబీలతో కూల్చివేతలు చేపట్టి 4 ఎకరాల భూమిని కాపాడింది.

చెరువులోకి జరిగి పలువురు నిర్మాణాలు చేపట్టారు. 4 ఎక‌రాల వ‌ర‌కూ జ‌రిగి ప్ర‌హ‌రీ నిర్మించి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్పడ్డారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టింది. మొత్తం చెరువు విస్తీర్ణం 76 ఎక‌రాలు కాగా.. ఈ మేర‌కు చెరువు లోప‌ల వైపు క‌బ్జాల‌కు ఆస్కారం లేకుండా చుట్టూ ఫెన్సింగ్​ వేసింది. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోనే 100 గ‌జాల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటిని, ఆ ప‌క్క‌నే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డును కూడా నేల‌మ‌ట్టం చేసింది.

HYDRAA | కఠిన చర్యలు

చెరువు లోప‌ల భాగం నుంచి క‌బ్జాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం అందుకున్న హైడ్రా క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారుల‌తో ప‌రిశీలించింది. చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) ప‌రిధిలో నిర్మాణాలు జ‌రుగుతున్న‌ట్టు నిర్ధారించుకుని చ‌ర్య‌లు చేప‌ట్టింది. స్థానిక ఇరిగేష‌న్ అధికారుల స‌మ‌క్షంలో హైడ్రా అధికారులు 1600 మీట‌ర్ల మేర ఫెన్సింగ్ వేశారు. చెరువుకు చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. చెరువును ఆక్రమించి, ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు చేపడుతామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : TGSPDCL ACB Trap | రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిన సబ్​ ఇంజినీర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *