Natural Childbirth Awareness | సిజేరియన్‌లకు స్వస్తి.. సహజ ప్రసవాలపై అవగాహన

సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి, సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యులు సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Natural Childbirth Awareness | సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి, సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యులు సూచించారు. బాన్సువాడ (Banswada) పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో సొసైటీ ఆఫ్ మిడ్‌వైఫ్ ఇండియా ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు.

Natural Childbirth Awareness | సహజ ప్రసవాలకు ప్రాధాన్యత..

ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజ్ జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి సహజ ప్రసవాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అను ప్రణతి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలపై మహిళలు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Natural Childbirth Awareness | తల్లి, శిశువు ఆరోగ్యానికి అనుకూలంగా..

తల్లి, శిశువు ఆరోగ్యానికి అనుకూలమైన ప్రసవ విధానాన్ని వైద్యుల సూచనల మేరకు ఎంచుకోవాలని ప్రణతి తెలిపారు. వైద్యపరంగా సాధ్యమైన సందర్భాల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని కోరారు. తల్లి, శిశువు ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో ప్రకాష్ రాథోడ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అను ప్రణతి, 13వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ ఖలేక్, కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, సుల్తానా గౌస్ తదితరులు పాల్గొన్నారు.

55555

ఇది కూడా చదవండి: పిల్లల్లో స్క్రీన్ టైమ్ పెరిగితే ఏమవుతుంది? పేరెంట్స్ తప్పక చూడాల్సిన వీడియో!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *