Hyderabad Police | వివాహ ఊరేగింపులో కత్తులతో విన్యాసం.. నలుగురి అరెస్ట్

వివాహ ఊరేగింపులో కత్తులతో విన్యాసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Police | వివాహ ఊరేగింపులో కత్తులతో విన్యాసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.

నగరంలోని రేతిబౌలిలో జరిగిన ఒక వివాహ ఊరేగింపులో నలుగురు వ్యక్తులు కత్తులతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. దీంతో గుడిమల్కాపూర్ పోలీసులు స్పందించి ఆ నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Police | ఆయుధాలు ప్రదర్శిస్తే చర్యలు

వివాహాలు, ఊరేగింపులు, బహిరంగ వేడుకల సమయంలో ఆయుధాలను కలిగి ఉండటం లేదా ప్రదర్శించడం పూర్తిగా నిషేధమని పోలీసులు తెలిపారు. వేడుకలను నిర్వహించే వారు, తమ కార్యక్రమాల వల్ల ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Telangana RERA Fines | రియల్ ఎస్టేట్ అక్రమార్కులకు రెరా షాక్.. ఏలియన్స్‌కు రూ.2 కోట్లు, ఆరో రియాల్టీకి రూ.25 లక్షల జరిమానా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *