జాతీయంMamata | ఫలితాలు రాక ముందే సీఎం నివాసం ఖాళీ చేసిన మమతా బెనర్జీ!

Mamata | ఫలితాలు రాక ముందే సీఎం నివాసం ఖాళీ చేసిన మమతా బెనర్జీ!

ఈ చర్యలపై ఇరువురు నేతల నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ఫలితాలు వెలువడిన తర్వాతే ఈ పరిణామాల వెనుక అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్షరటుడే వెబ్‌డెస్క: Mamata | పశ్చిమ బెంగాల్, కేరళ Kerala రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.

Mamata | కౌంటింగ్​కు ముందే..

ఫలితాలు రాకముందే మమతా బెనర్జీ Mamata Banerjee తన అధికారిక సీఎం నివాసాన్ని ఖాళీ చేసినట్లు సమాచారం. ఈ చర్య అనూహ్యంగా మారడంతో, ఆమె రాజకీయ వ్యూహంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, పినరయి విజయన్ తన ‘ఎక్స్’ (మునుపటి ట్విట్టర్) ప్రొఫైల్‌లో ముఖ్యమంత్రి హోదాను తొలగించి, “పొలిట్ బ్యూరో సభ్యుడు, సీపీఐ(ఎం)”గా మార్చడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్‌కు కొద్దిసేపటి ముందు ఈ చర్యలు చోటుచేసుకోవడం వల్ల, ఫలితాలపై ముందస్తు అంచనాలు ఉన్నాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటమిని పసిగట్టారా..?

సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఓటమిని ముందుగానే పసిగట్టారా..? లేక ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్న ఫలితాల ఆధారంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ చర్యలపై ఇరువురు నేతల నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఫలితాలు వెలువడిన తర్వాతే ఈ పరిణామాల వెనుక అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Share post:

Popular

More like this
Related

Kamareddy murder case | ఒంటరి మహిళలే లక్ష్యంగా దారి దోపిడీ.. వృద్ధురాలి హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు!

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy murder case | ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని...

Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

అక్షరటుడే వెబ్‌డెస్క: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో...

Tumakuru family tragedy | పరాయి వ్యక్తి మోజులో భార్య పరారీ.. ఇద్దరు బిడ్డలను చంపి, తండ్రి ఆత్మహత్య!

అక్షరటుడే వెబ్‌డెస్క: Tumakuru family tragedy | కట్టుకున్న భార్య మోసానికి మరో...

Karimnagar substation fire | దుర్షేడ్ సబ్ స్టేషన్‌లో కార్చిచ్చు.. ఎగసిపడుతున్న మంటలు

అక్షరటుడే వెబ్‌డెస్క: Karimnagar substation fire | కరీంనగర్ జిల్లాలో భారీ...