అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TOMCOM Training | తెలంగాణ ప్రభుత్వం ‘టామ్‌కామ్’ (TOMCOM) ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
TOMCOM Training | ప్రభుత్వ సహకారంతో..
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే ఎంతోమంది జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, యూకే, సౌదీ అరేబియా, ఫిజీ తదితర దేశాల్లో కొలువులు సాధించారన్నారు. నర్సింగ్, కార్పెంటర్, ఫిజియోథెరపీ వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఉండటంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. అభ్యర్థులకు ఉచితంగా జర్మన్ తదితర విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి, ఉత్తీర్ణులైన వారికి వీసాలు సమకూర్చి ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విదేశాల్లో స్థిరపడిన అభ్యర్థుల అనుభవాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
TOMCOM Training | భాషపై పట్టు సాధించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. విదేశీ ఉద్యోగాల్లో రాణించాలంటే స్థానిక భాషపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే తపనతోనే తాను సైతం ఇష్టంతో తెలుగు నేర్చుకున్నానని గుర్తుచేశారు. టామ్‌కామ్ శిక్షణ వివరాలు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలిసేలా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, నుడా ఛైర్మన్ కేశ వేణు, తెయూ పాలకమండలి సభ్యుడు సీహెచ్ రజనీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి విజేత, జర్మన్ భాషా బోధకుడు ధీరజ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Hidden History of Sri Ram Sagar Project