Puppalaguda Land Dispute | అర్ధరాత్రి రోడ్డు వేసిన రియల్​ ఎస్టేట్​ సంస్థ.. అడ్డకున్న స్థానికుల అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడలో ఓ వివాదాస్పద భూమిలో రియల్​ ఎస్టేట్​ సంస్థ అర్ధరాత్రి హడావుడిగా రోడ్డు వేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Puppalaguda Land Dispute | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పుప్పాలగూడలో ఓ వివాదాస్పద భూమిలో రియల్​ ఎస్టేట్​ సంస్థ అర్ధరాత్రి హడావుడిగా రోడ్డు వేసింది. దానిని అడ్డుకునేందుకు స్థానికులు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

పుప్పాలగూడ సర్వే నెంబర్ 300లోని పట్టా భూమిని సైబర్ సిటీ వెస్ట్ బ్రోక్ రియల్ ఎస్టేట్ సంస్థ అర్ధరాత్రి జేసీబీలతో చదును చేసి రోడ్డు నిర్మించేందుకు యత్నించింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పట్టా భూమిలోకి ప్రవేశించినట్లు స్థానికులు ఆరోపించారు.

Puppalaguda Land Dispute | పోలీస్​ బందోబస్తు మధ్య..

భారీ పోలీస్ బందోబస్తు మధ్య రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం గమనార్హం. దీంతో ఆ భూమి పట్టదారులు రోడ్డు పనులను అడ్డుకున్నారు. లారీలు, జేసీబీలకు అడ్డుగా పడుకుని ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు వారిని ఆపారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అర్ధరాత్రి వేళ రోడ్డు పనులు చేపట్టడంపై పట్టాదారులు అభ్యంతరం తెలిపారు. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నా, హెచ్ఎండీఏ, పోలీసుల అండతో దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Travel Bus Accident | లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *