అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Prakasam Road Accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టంగుటూరు టోల్గేట్ వద్ద కారును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున టోల్ చెల్లించేందుకు ఓ కారు వేచి ఉంది. ఆ కారు ముందు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉంది. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బస్సు, లారీ మధ్య కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Prakasam Road Accident | ఓటు వేసేందుకు వచ్చి..
గ్రామానికి చెందిన ఆరుగురు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు శనివారం రాత్రి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో టంగుటూరు టోల్‌ప్లాజా వారి కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Prakasam Road Accident | అత్యంత బాధాకరం
టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
దీనిని కూడా చదవండి : HMDA Land Auction | హెచ్ఎండీఏ భూముల వేలానికి స్పందన కరువు