అక్షరటుడే, వెబ్‌డెస్క్: Election results | దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ, పుదుచ్చేరి ఎన్డీయే కూటమి, తమిళనాడులో డీఎంకే కూటమి, కేరళలో యూడీఎఫ్ కూటమి ముందంజలో ఉన్నాయి. బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
Election results | పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఇలా..
బెంగాల్‌లో బీజేపీ అగ్రనేతల ముందంజలో ఉండగా.. నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్‌లో సీఎం మమత బెనర్జీ వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక తమిళనాడులో తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందంజలో ఉన్నారు. టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్‌లో ఆధిక్యంలో ఉండగా.. తిరుచ్చి ఈస్ట్‌లో విజయ్ వెనుకంజలో ఉన్నారు. చెపాక్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మైలాపూర్‌లో తమిళిసై వెనుకంజలో ఉన్నారు. ఎడప్పాడిలో ఏఐడీఎంకే అభ్యర్థి పలనీ స్వామి ఆధిక్యంలో ఉన్నారు. అస్సాంలోని జలూక్పురిలో సీఎం హిమంత బిస్వా శర్మ లీడింగ్‌లో ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Assembly Election Counting | ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. పేరంబదూర్లో విజయ్ ముందంజ!

