జాతీయంTamil Nadu Election Shock | కొళత్తూరులో స్టాలిన్ ఢమాల్.. చెపాక్‌లో ఉదయనిధి పోరాటం!

Tamil Nadu Election Shock | కొళత్తూరులో స్టాలిన్ ఢమాల్.. చెపాక్‌లో ఉదయనిధి పోరాటం!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tamil Nadu Election Shock | తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే అగ్రనేతలు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తమ సొంత నియోజకవర్గాల్లోనే తీవ్ర గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

Tamil Nadu Election Shock | కొళత్తూరులో ముఖ్యమంత్రికి షాక్..

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో లెక్కింపు వేళ అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం 22 రౌండ్ల లెక్కింపునకు గాను, 11 రౌండ్లు ముగిసేసరికి స్టాలిన్ 8,019 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. కౌంటింగ్ సగం పూర్తికావస్తున్నా ముఖ్యమంత్రే వెనుకబడి ఉండటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Tamil Nadu Election Shock | చెపాక్‌లో ఉదయనిధి స్టాలిన్ ఎదురీత..

మరోవైపు చెన్నై నగరంలోని కీలకమైన చెపాక్ నియోజకవర్గంలో ఉదయనిధి స్టాలిన్ పరిస్థితి కూడా ఉత్కంఠభరితంగా మారింది. ఇక్కడ మొత్తం 17 రౌండ్లకు గాను ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉదయనిధి కేవలం 1,048 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు మెజారిటీ మారుతుండటంతో అక్కడ గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.

అగ్రనేతలే వెనుకంజలో లేదా స్వల్ప ఆధిక్యంలో ఉండటంతో డీఎంకే శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

ఇదా కూడా చదవండి: Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Bengal Victory|పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా...

Kamareddy Municipal Commissioner | కామారెడ్డి,ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి: Kamareddy Municipal Commissioner | కామారెడ్డి జిల్లా (Kamareddy...

CPO Teachers Issue | సీపీవోలుగా ఉపాధ్యాయులను సమంజసం కాదు

అక్షరటుడే, కామారెడ్డి: CPO Teachers Issue | రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో...

Kamareddy Fire Victims | బాధితులను ఆదుకుంటాం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Victims | పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద...