BJP victory rally | నగరంలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ.. సంబరాలు

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BJP victory rally | పశ్చిమ బెంగాల్ (West Bengal), అస్సాం (Assam), పుదుచ్చేరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ, సంబరాలు నిర్వహించారు.

BJP victory rally | నిఖిల్ సాయి చౌరస్తా వద్ద..

నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (Urban MLA Dhanpal) ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.  రంగులు చల్లుకుని.. పటాకులు కాల్చారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ధన్​పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ (Mamata Banerjee) అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు బీజేపీని గెలిపించారన్నారు.  బెంగాల్​లో బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు. ఊహించిన దానికంటే భారీ సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు అభివృద్ధి, పారదర్శకత, భద్రతను కోరుకుంటున్నారని మరోసారి నిరూపించారన్నారు.

BJP victory rally | బెంగాల్​లో టీఎంసీకి ఎదురుదెబ్బ..

ప్రధానంగా బెంగాల్ ప్రజలు భయం, అవినీతి, అశాంతిపై తిరుగుబాటు చేశారని స్పష్టం చేశారు. మోదీ సారథ్యంలో ప్రజల విశ్వాసాన్ని బెంగాల్​లో ఏర్పడబోయే ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. ఈ తీర్పుతో దేశ రాజకీయాలకు కొత్త దిశను చూపుతోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ మార్పు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఫలితాలు చూస్తే ఇది కేవలం ఓటింగ్ కాదని.. ప్రజల ఆలోచన విధానం మారుతుందనడానికి సంకేతమన్నారు. ఇక కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోయిందని తెలిపారు. అస్సాంలో మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండడంతో మళ్లీ ఆశీర్వదించారన్నారు. పుదుచ్చేరిలోనూ (Puducherry) బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు.

BJP victory rally | ప్రధాని మోదీ నేతృత్వంలో సమర్థమైన పాలన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేసిందని ఎమ్మెల్యే అన్నారు. డబుల్​ ఇంజిన్ సర్కార్​తోనే అభివృద్ధి సాధ్యమని అక్కడి ప్రజలు గట్టిగా నమ్మారన్నారు. తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పడకుండా నటుడు విజయ్​కు వెళ్లాయన్నారు. విజయ్ కాంగ్రెస్, డీఎంకేలతో కలవకుండా మోదీ డబుల్ ఇంజిన్ సర్కారుతో కలిసి నడవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్​ నాయకులు గోపిడి స్రవంతి రెడ్డి, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ప్రమోద్ కుమార్, జ్యోతి, బద్దం కిషన్, బొబ్బిలి వేణు, ఇందూర్ సుధా, కల్పె చిరంజీవి, ఇప్పాకాయల కిషోర్, పద్మారెడ్డి, నాయిడి రాజన్న, పవన్​, ఆనంద్ రావు, బంటు ప్రవీణ్, ఆనంద్ విజయ్ కృష్ణ, చీకోటి రవి, అన్నం గోపి, మల్కాయి మహేందర్, పుట్ట వీరేందర్ పలువురు పాల్గొన్నారు.

chiru

bjp21

ఇది కూడా చదవండి: SSC Hindi Translator | డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *