CPO Teachers Issue | సీపీవోలుగా ఉపాధ్యాయులను నియమించడం సమంజసం కాదు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: CPO Teachers Issue | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సీపీవోలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించడం సమంజసం కాదని స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పీబీ సత్యం అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

CPO Teachers Issue | రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదే అయినప్పటికీ..

రాష్ట్రంలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలకు సీపీవోలను (Child Protection Officer) నియమించడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు. అయితే ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ సబ్జెక్టులు బోధిస్తున్న ఉపాధ్యాయులలో ఒకరిని ఎంపిక చేసుకుని వారికి న్యాయసేవ సంస్థ ద్వారా చట్టాలపై శిక్షణనిచ్చి.. రాష్ట్రంలోని 5,711 పాఠశాలల్లో సీపీవోలుగా నియమించడం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదన్నారు.

ఇలా నియమించడం వల్ల.. ఉపాధ్యాయులు (Teachers) విద్యార్థులకు ఎప్పుడు పాఠాలు బోధిస్తారు..? సీపీవోలుగా బాధ్యతలు ఎప్పుడు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై పనిభారంతో పాటు తీవ్రమైన ఒత్తిడి పడుతుందన్నారు. దీనివల్ల విద్యార్థులకు న్యాయం జరగదన్నారు. సోషల్ వర్క్ పూర్తిచేసిన అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన సీపీవోలుగా నియమించాలని ప్రభుత్వాన్ని, విద్యాశాఖ (Education Department) అధికారులను కోరారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా స్వాన్ ఇండియా అధికార ప్రతినిధులు శ్రీనివాస్, విజయ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Fire Victims | బాధితులను ఆదుకుంటాం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *