DFO Siddharth Vikram Singh | అడవుల సంరక్షణకు ప్రజలు మద్దతివ్వాలి: డీఎఫ్​వో సిద్ధార్థ్​ విక్రమ్​ సింగ్​

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: DFO Siddharth Vikram Singh | అడవుల సంరక్షణకు (forest conservation) ప్రజలు మద్దతివ్వాలని నిజామాబాద్​ జిల్లా అటవీశాఖ (District Forest Department) అధికారిగా విక్రమ్​ సిద్ధార్థ్ కోరారు. జిల్లాలో నూతన డీఎఫ్​గా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్​ ఇలా త్రిపాఠిని (Collector Ila Tripathi) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు.

DFO Siddharth Vikram Singh | అడవిలో అక్రమ కార్యకలాపాల నిరోధానికి..

బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎఫ్​వో (DFO) మాట్లాడుతూ.. అడవిలో అక్రమ కార్యకలాపాల నిరోధనానికి శాఖ సిబ్బందికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. వన్యప్రాణుల సమస్యలను (wildlife protection) బాధ్యతాయుతంగా చూడాలని సూచించారు. ప్రజలకు అటవీ ఉత్పత్తులు, సంపదపై అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమని ఆయన అన్నారు. అటవీ సంరక్షణ, మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నివారణ, సుస్థిర పర్యావరణ పర్యాటక అభివృద్ధి పరంగా నిజామాబాద్ జిల్లాకు గణనీయమైన సామర్థ్యం ఉందన్నారు. అడవుల సంరక్షణకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి: PM Modi | బీజేపీకి ఇది చారిత్రక రోజు : ప్రధాని మోదీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *