అక్షరటుడే, డిచ్పల్లి: Farmers Protest | వరి కోతలు పూర్తవడంతో అన్నదాతలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే కొనుగోళ్లు జరగకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనళకు దిగుతున్నారు.
Farmers Protest | డిచ్పల్లి మండలం ధర్మారంలో..
ధాన్యం కాంట చేయడం లేదని ఆగ్రహిస్తూ డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లో రైతులు సోమవారం సాయంత్రం ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో చాలా రోజులుగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంటకు పైగా రైతులు ఆందోళన చేయడంతో నిజామాబాద్ – హైదరాబాద్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తహశీల్దార్ సతీశ్ రెడ్డి, ఎస్సై ఆరీఫ్ వారి వద్దకు చేరుకుని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ధాన్యం సేకరించే వరకు ఊరుకోబోమని సంచులు లేవని, లారీలు రావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై గందరగోళం నెలకొంది. రేపు రెండు లారీలు పంపిస్తానని తహసీల్దార్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇది కూడా చదవండి..: Farmers Protest | కాంగ్రెస్ పాలనలో రైతులను దోచుకుంటున్నారు..

