అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fauji Movie | ప్రభాస్ (Prabhas) ఫౌజీ మూవీ షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం వెళ్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ (Fauj) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూవీ షూటింగ్ వెళ్తున్న యూనిట్ సభ్యులు కార్లలో బయలు దేరారు. హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Fauji Movie | డివైడర్‌ను ఢీకొనడంతో..
ఫౌజీ సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ వార్ డ్రామాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చిత్ర యూనిట్ షూటింగ్ కోసం వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి..: Academy Awards AI Rules | ఆస్కార్ అవార్డుల్లో కీలక మార్పులు.. ఏఐ వినియోగంపై కొత్త నిబంధనలు!

