అక్షరటుడేవెబ్‌డెస్క్:Punjab Political Crisis| పంజాబ్ రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశ రాజధానికి చేరాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, మంగళవారం (మే 5, 2026) ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. తనతో పాటు మరికొందరు ఎంపీలను తీసుకువెళ్లిన ఆయన, పంజాబ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం తమను రాజకీయంగా వేధిస్తోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
Punjab Political Crisis| రాజ్యాంగ హక్కులను కాలరాసేలా..
రాజ్యసభ చైర్మన్ నిర్ణయం మేరకు ఆప్ ఎంపీల బృందం బీజేపీలో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ రాజ్యాంగ హక్కులను కాలరాసేలా పంజాబ్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని రాఘవ్ చద్దా ఆరోపించారు. గతంలో రాజకీయ కక్ష సాధింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆప్, ఇప్పుడు అంతకంటే దారుణంగా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
Punjab Political Crisis| రాష్ట్రపతి హామీ..
రాష్ట్రపతితో భేటీ అనంతరం రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “రాజ్యాంగ విలువల పట్ల, ప్రజాస్వామ్య నిర్ణయాల పట్ల గౌరవం ఉండాలని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. ఆమె మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి” అని పేర్కొన్నారు.
Punjab Political Crisis| ఢిల్లీకి పంజాబ్ సీఎం బృందం..
ఇదిలా ఉండగా, బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి , ఇతర మంత్రులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. వీరు కూడా రాష్ట్రపతి ముర్మును కలిసి తమ వాదనను వినిపించే అవకాశం ఉంది. ఇరుపక్షాల పోరాటంతో పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: AP POLYCET Results| ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. మన్యం జిల్లాలే ‘టాప్’!

