తెలంగాణBhu Bharati server down | భూ భారతి సర్వర్​ డౌన్​.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

Bhu Bharati server down | భూ భారతి సర్వర్​ డౌన్​.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో మంగళవారం భూ భారతి సేవలు నిలిచిపోయాయి. సర్వర్​ డౌన్​ కావడంతో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఆగిపోయాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhu Bharati server down | రాష్ట్రంలో మంగళవారం భూ భారతి (Bhu Bharati) సేవలు నిలిచిపోయాయి. సర్వర్​ డౌన్​ కావడంతో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఆగిపోయాయి. దీంతో కార్యాలయాకు వచ్చిన ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాశారు.

భూ భారతి పోర్టల్ సర్వర్ డౌన్‌తో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో సబ్-రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయాల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రిజిస్ట్రేషన్ల కోసం ఉదయమే కార్యాలయాలకు చేరుకున్న ప్రజలు సర్వర్​ రాకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అయితే సాయంత్రం వరకు కూడా సర్వర్​ రాకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. మ్యూటేషన్లు, స్లాట్ బుకింగ్స్, ఈసీ డౌన్లోడ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. సేవలు పునరుద్ధరించేందుకు సాంకేతిక నిపుణులు యత్నిస్తున్నారు.

Bhu Bharati server down | తరచూ సమస్య

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. అయితే ఈ పోర్టల్​ తరచూ మొరాయిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్టేషన్ల శాఖ సర్వర్​ సక్రమంగా పని చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్ సామర్థ్యం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక కారణాలు, సర్వర్లపై ఒత్తిడి పెరగడంతో అంతరాయం ఏర్పడి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Transfers | రాష్ట్రంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Police vehicle checking | పోలీసుల వాహనాల​ తనిఖీలు.. తప్పించుకునే క్రమంలో కారుబోల్తా

అక్షరటుడే, బాల్కొండ: Police vehicle checking | పోలీసులు వాహనాలు​ తనిఖీలు...

High Court holidays | మే 7 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court holidays | తెలంగాణ హైకోర్టు...

TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ ముందుంటుంది

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి...

RB Choudhary | ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RB Choudhary | ప్రముఖ సినీ నిర్మాత...