క్రైంPOCSO case verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి జీవితఖైదు

POCSO case verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి జీవితఖైదు

పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

అక్షరటుడే, కామారెడ్డి: POCSO case verdict | పోక్సో కేసులను కామారెడ్డి కోర్టు (Kamareddy court) సీరియస్​గా పరిగణిస్తోంది. గతేడాది మార్చి చివరి వారంలో ముగ్గురు పోక్సో నిందితులకు(POCSO case) 20ఏళ్ల పాటు జైలు శిక్ష విధించగా తాజాగా మంగళవారం మరో కేసులో జీవితఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

POCSO case verdict | దేవునిపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో..

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ (Devunipalli Police Station) పరిధిలో ఓ విద్యార్థిని పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటుండగా అదే కాలేజీలో చదువుతున్న తోకల రాజశేఖర్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఫోన్​కు వీడియోలు పంపి భయపెట్టాడు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడిన ఫోన్​ రికార్డులను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

POCSO case verdict | పక్కా ఆధారాలతో కేసు విచారణ..

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం రాజశేఖర్​ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి పోక్సో చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాలు, వైద్య నివేదికను పరిశీలించి కేసు రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఇది కూడా చదవండి: Beedi Thekedars | డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలి.. బీడీ టేకేదార్ల డిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Police vehicle checking | పోలీసుల వాహనాల​ తనిఖీలు.. తప్పించుకునే క్రమంలో కారుబోల్తా

అక్షరటుడే, బాల్కొండ: Police vehicle checking | పోలీసులు వాహనాలు​ తనిఖీలు...

High Court holidays | మే 7 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court holidays | తెలంగాణ హైకోర్టు...

TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ ముందుంటుంది

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి...

RB Choudhary | ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RB Choudhary | ప్రముఖ సినీ నిర్మాత...