తెలంగాణcrop procurement | పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : కేటీఆర్​

crop procurement | పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : కేటీఆర్​

ధాన్యం దళారుల పాలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : crop procurement | ధాన్యం దళారులపాలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)​ అన్నారు. పంటల కొనుగోలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్​ మంగళవారం సంగారెడ్డి (Sangareddy) జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. పరకాల నియోజకవర్గంలో ఊకల్​, జనగామ నియోజకవర్గం యశ్వంత్​పూర్​లో పర్యటించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుండె.. ఇప్పుడు పంటలు కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకుంటుందన్నారు.

crop procurement | రైతులు చనిపోతున్నా…

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పిట్టల్లా రాలుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతీ గింజను ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2460 మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం మక్కలు కొంటలేదన్నారు.

crop procurement | పెద్ద ఎత్తున ఆందోళనలు

పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని కేటీఆర్​ అన్నారు. ధాన్యం, శనగలు, మొక్కజొన్నలు, ఇతర అన్ని పంటలను వెంటనే కొనుగోలు చేయకుంటే, ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి :  Konda Surekha Comments | పుష్కరాలకు ఏపీకి కోట్లు.. తెలంగాణకు సున్నా.. కేంద్రం వివక్షపై సురేఖ ఆగ్రహం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay Congress Support | తమిళనాడులో విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక చర్చలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Congress Support | తమిళనాడు రాజకీయాల్లో సంచలన...

AI Education Telangana | పాఠశాల, సాంకేతిక, వైద్య విద్యల్లో ఏఐ వినియోగంపై ఉన్నతస్థాయి కమిటీ : సీఎం రేవంత్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AI Education Telangana | ప్రాథమిక, ఉన్నత పాఠ‌శాల‌,...

Tandur single window | తాండూరు సింగిల్ విండో ఛైర్మన్‌గా ఆకిడి గంగారెడ్డి.. హైకోర్టు తీర్పుతో తిరిగి బాధ్యతలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tandur single window | నాగిరెడ్డిపేట(Nagireddypet) మండలం తాండూరు...

India IT Rules | “సెన్సార్‌షిప్‌” అసంపూర్ణ వాదన.. ఐటీ నిబంధనలపై విమర్శలకు భారత రాయబారి కౌంటర్‌!

అక్షరటుడే, వెబ్​డెస్క్: India IT Rules | భారత ఐటీ నిబంధనలపై వచ్చిన...