AI Education Telangana | పాఠశాల, సాంకేతిక, వైద్య విద్యల్లో ఏఐ వినియోగంపై ఉన్నతస్థాయి కమిటీ : సీఎం రేవంత్​

Naresh Chandan
AI Education Telangana

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AI Education Telangana | ప్రాథమిక, ఉన్నత పాఠ‌శాల‌, సాంకేతిక విద్య‌తో పాటు వైద్య విద్య సిల‌బ‌స్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, దాని ఉప‌యోగంపైన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని, ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్​ని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కోరారు.

తెలంగాణ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య‌మంత్రి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి Bhatti_Mallu, మంత్రితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

AI Education Telangana | ఏఐని వినియోగిస్తే అంద‌రికి మేలు

ఏఐ వినియోగంతో పాటు మిడిల్ లెవ‌ల్ ఉద్యోగాల కల్ప‌న కోసం స్కిల్స్ యూనివ‌ర్సిటీ, ఏటీసీల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి వివ‌రించారు. స‌రైన ప‌ద్ద‌తిలో ఏఐని వినియోగిస్తే అంద‌రికి మేలు జ‌రుగుతుంద‌ని రాజన్ చెప్పారు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో పారిశ్రామిక విధానం ఉంటే మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చున‌ని తెలిపారు.

Data Centers కోసం పెద్ద ఎత్తున విద్యుత్, నీటి వినియోగం ఉంటుంద‌ని చెప్పారు. మూడు నాలుగు నెల‌ల్లో హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తాన‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు ఉన్నాయ‌ని రఘురామ్ రాజన్ వివరించారు. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాలంటూ పలు సూచనలు చేశారు.

ప్ర‌భుత్వాలు అనుసరించే సుల‌భ‌త‌ర వ్యాపార విధానాలపై ఆధార‌ప‌డి కొత్త‌ ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని చెప్పారు. Startups ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం ఉంటుంద‌ని చెప్పారు.

AI Education Telangana | భూమితో పాటు మౌలిక స‌దుపాయాలు

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి భట్టి మల్లు విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల కోసం కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు. కావాల్సిన భూమితో పాటు మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నామ‌న్నారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, అవుట‌ర్ రింగ్ రోడ్డుతో పాటు అనేక స‌దుపాయాలు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు.

రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభ‌జించి అభివృద్ధి పైన దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. CURE, PURE, RARE విధానంలో ముందుకు వెళ్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి 24 గంట‌లు క‌ష్ట‌పడుతున్నార‌న్నారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి కోసం త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని రఘురామ్ రాజన్ ని కోరారు.

AI Education Telangana | అనుకూల ప‌రిస్థితులు

సుల‌భ‌త‌ర వ్యాపారానికి తెలంగాణలో అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు వివరించారు. Pharma, ఐటీ, డేటా సెంటర్ల కోసం కావాల్సిన మంచి వాతావ‌ర‌ణం, వ‌స‌తులు క‌ల్పిస్తున్న‌ట్లు రఘురామ్ రాజన్ కి వివ‌రించారు.

ఈ సమావేశంలో Telangana CS కె. రామకృష్ణా రావు, సీఎంవో ముఖ్య కార్య‌ద‌ర్శి శేషాద్రి, సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీలు jayesh_ranjan, వాణీ ప్ర‌సాద్ పాల్గొన్నారు.

India IT Rules | “సెన్సార్‌షిప్‌” అసంపూర్ణ వాదన.. ఐటీ నిబంధనలపై విమర్శలకు భారత రాయబారి కౌంటర్‌!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *