అంతర్జాతీయంKC-135 Emergency Signal | అమెరికా ఫ్లైయింగ్​ గ్యాస్​ స్టేషన్​ అదృశ్యం.. గల్ఫ్​ ప్రాంతంలో ఘటన!

KC-135 Emergency Signal | అమెరికా ఫ్లైయింగ్​ గ్యాస్​ స్టేషన్​ అదృశ్యం.. గల్ఫ్​ ప్రాంతంలో ఘటన!

పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KC-135 Emergency Signal | అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైందన్న సమాచారం దావానంలా వ్యాపించింది. “ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్”గా పిలవబడే ఈ విమానం గగనతలంలో ఇతర యుద్ధ విమానాలకు ఇంధనం నింపుతుంది.

KC-135 Emergency Signal | హోర్ముజ్ జలసంధి సమీపంలో

ఫ్లైట్ డేటా ప్రకారం.. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా.. అత్యవసర పరిస్థితిని సూచించే 7700 స్క్వాక్ కోడ్‌ను జారీ చేసింది. అనంతరం విమానం ఎత్తు తగ్గిస్తూ, మార్గాన్ని ఖతార్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. అయితే, అత్యవసర సంకేతం ఇచ్చిన సుమారు గంట తర్వాత ఈ విమానం పబ్లిక్ రాడార్ నుంచి పూర్తిగా కనుమరుగైంది.

ప్రస్తుతం ట్రాన్స్‌పాండర్ సిగ్నల్ కోల్పోవడం అనేది విమానం కూలిపోయిందని నిర్ధారించకపోయినా.. ఈ పరిణామాలు తీవ్రమైన ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాలను మాత్రం పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి శకలాలు కనిపించలేదు, రక్షణ చర్యలు ప్రారంభమైనట్లు కూడా సమాచారం లేదు. ఇతర అత్యవసర సంకేతాలు అందినట్టు కూడా ధృవీకరించ లేదు.

పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా.. పరిస్థితులు ఇంకా పూర్తిగా స్థిరపడలేదు.

Sudha Reddy Met Gala | మెట్ గాలాలో సుధా రెడ్డి.. రూ. 140 కోట్ల టాంజానైట్ నెక్లెస్‌తో మెరుపులు!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Trump Warning | ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్​పై దాడులు : ట్రంప్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warning | ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని...

Summer special camps | ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి ప్రత్యేక శిబిరాలు: డీఈవో రాజు

అక్షరటుడే, కామారెడ్డి: Summer special camps | జిల్లాలోని 6 నుండి...

Election Commission Case | సుప్రీంకోర్టులో కేంద్రానికి షాక్.. ఆ విన్నపాన్ని తోసిపుచ్చిన ధర్మాసనం!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Election Commission Case| కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌...

Metro Phase 2 | మెట్రో ఫేజ్​–2కు ఆమోదం తెలపాలి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Metro Phase 2 | హైద‌రాబాద్ మెట్రో...