అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Alliance|తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా, తిరు సి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. లౌకిక , సంక్షేమ ప్రభుత్వం కావాలని తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ (AICC) వెల్లడించింది.
Tamil Nadu Alliance|మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలనే షరతు..
ఈ మద్దతు ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన నిబంధనను విధించింది. భారత రాజ్యాంగంపై నమ్మకం లేని ఎటువంటి మతతత్వ శక్తులను (Communal forces) ఈ కూటమిలోకి చేర్చుకోకూడదనే షరతుపైనే టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజ్యాంగ సూత్రాలను కాపాడటం , అమలు చేయడం తమ బాధ్యతగా కాంగ్రెస్ పేర్కొంది.
Tamil Nadu Alliance|భవిష్యత్తు ఎన్నికల్లోనూ కొనసాగనున్న కూటమి..
ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం కేవలం ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటుకే పరిమితం కాదని ప్రెస్ రిలీజ్ పేర్కొంది. పరస్పర గౌరవం , బాధ్యతలతో ఏర్పడిన ఈ కూటమి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు లోక్‌సభ , రాజ్యసభ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయనుందని ఏఐసీసీ ఇంచార్జ్ గిరీష్ చోడంకర్ తెలిపారు.
Tamil Nadu Alliance|ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని ప్రతిజ్ఞ ..
ఈ చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని విజయ్ , రాహుల్ గాంధీ సంయుక్తంగా ప్రతిజ్ఞ చేశారు. తమిళనాడులో పెరున్తలైవర్ కామరాజ్ పాలనా వైభవాన్ని తిరిగి తీసుకురావడంతో పాటు, తంతై పెరియార్ సామాజిక న్యాయం , డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాల సాధన కోసం ఈ కూటమి కృషి చేస్తుందని ప్రకటనలో వివరించారు.
Congress party officially announced its support to @TVKPartyHQ to form the next government under the leadership of Thiru @TVKVijayHQ .
Thanks to Thalaivar @RahulGandhi for his good decision. #Congress #TVKVijay #RahulGandhi pic.twitter.com/lEzv9DRnAl
— KTL (@K_T_L) May 6, 2026
ఇది కూడా చదవండి: Railway Bypass Launch | రైల్వే బైపాస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

