Nizamabad Road Accident | వేగంగా దూసుకెళ్లిన డెంటల్​ విద్యార్థి.. కారు ఢీకొని చిన్నారి దుర్మరణం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Road Accident | నిజామాబాద్ జిల్లా Nizamabad రూరల్ ప్రాంతంలోని చక్రధర్‌నగర్ తండా లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిన్నారి కీర్తన (6) రోడ్డును దాటుతూ వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కీర్తనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

Nizamabad Road Accident | కారు సీజ్

పోలీసుల పరిశీలనలో.. ప్రమాదానికి కారణమైన కారును ఒక డెంటల్ కాలేజీ విద్యార్థి నడిపినట్టు గుర్తించారు. కీర్తన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు.

చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతపై పోలీసులు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు.

West Bengal Political Violence | పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ నెత్తురోడిన రాజకీయం.. బీజేపీ నేత సువేందు పీఏ దారుణ హత్య

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *