kamareddy police | పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్..

Balla Sandeep Kumar

అక్షరటుడే, గాంధారి: kamareddy police | జిల్లాలో పేకాట నియంత్రణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయినా కూడా ఆగడం లేదు. పేకాట రాయుళ్లు స్థావరాలు మారుస్తూ కొనసాగిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

kamareddy police | నగదు స్వాధీనం

తాజాగా.. గాంధారి మండలం నేరేల్ తండా శివారులో నిర్వహిస్తున్న ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 2,260, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Chain Snatching | బరితెగించిన చైన్​ స్నాచర్లు.. మూడున్నర తులాల బంగారం గొలుసు అపహరణ!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *