అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Stock Market | అమెరికా, ఇరాన్ ల మధ్య శాంతి చర్చల విషయంలో రోజుకో రకమైన వార్తలు వ్యాపిస్తున్నాయి. దీంతో అనిశ్చితి కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్‌కు వంద డాలర్లపైన కొనసాగుతుండడం, రూపాయి విలువ మళ్లీ పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఒత్తిడికి గురవుతోంది.
గురువారం ఉదయం సెన్సెక్స్ 381 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా ప్రాఫిట్ బుకింగ్‌తో 541 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 25 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 123 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 77,803 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 24,312 వద్ద ఉన్నాయి.
Today Stock Market | మిక్స్ డ్ గా సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లోని ఇండెక్స్‌లు మిక్స్ డ్‌గా స్పందిస్తున్నాయి. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 1.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.10 శాతం, పవర్ 1 శాతం, టెలికాం ఇండెక్స్ 0.84 శాతం, మెటల్ 0.59 శాతం లాభాలతో ఉండగా.. ఐటీ 0.80 శాతం, రియాలిటీ 0.69 శాతం, ఎఫ్ఎంసీజీ 0.65 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.63 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎంఅండ్ఎం 1.70 శాతం, ఎన్టీపీసీ 1.46 శాతం, కొటక్ బ్యాంక్ 0.77 శాతం, టాటా స్టీల్ 0.72 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.49 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టైటాన్ 1.88 శాతం, హెచ్ యÖఎల్ 1.56 శాతం, టెక్ మహీంద్రా 1.47 శాతం, టీసీఎస్ 1.31 శాతం, అదానీపోర్ట్స్ 1.16 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Gold Rates May 2026 | అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

