కరీంనగర్Karimnagar Tension | కరీంనగర్​లో హైటెన్షన్​.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నం..

Karimnagar Tension | కరీంనగర్​లో హైటెన్షన్​.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నం..

కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంపు కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Karimnagar Tension | కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ (MLA Gangula Kamalakar) క్యాంపు కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కొందరు బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆయన కారుతో పాటు కమలాకర్​ కార్యాలయంలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Karimnagar Tension | బండి సంజయ్​పై తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో..

కరీంనగర్‌లోని ఎమ్మలె గంగుల క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (MLA Kaushik Reddy) గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన తంబాకుతో డ్రగ్స్‌ కలిపి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే అందువల్లే ఆయన తలపై వెంట్రుకలు ఊడిపోయాయని విమర్శించారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌ డ్రగ్స్‌ టెస్టుకు సిద్ధంగా ఉన్నారని.. అయితే సంజయ్‌ కూడా టెస్టులకు రావాలని కౌశిక్​రెడ్డి డిమాండ్‌ చేశారు. బండి సంజయ్.. గతంలో తన భార్య పుస్తెలు అమ్మి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారని.. మరి కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఎలా ఖర్చు చేశారంటూ నిలదీశారు.

Karimnagar Tension

Karimnagar Tension | తీవ్ర ఉద్రిక్తత

ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు(BJP Leaders)  గంగుల క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay)పై వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. అలాగే క్యాంప్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టి , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పలువురు బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు.. బండి సంజయ్‌ కారును బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఇది కూడా చదవండి..: Karimnagar Jewellery Robbery | కరీంనగర్ జ్యూవెలరీ దోపిడీ కేసులో సంచలన మలుపు.. ఆ గ్యాంగ్ హస్తం ఉంద‌ని నిర్ధారణ?

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​ ఇంజిన్​ సర్కార్​’ : దినేష్​ కులాచారి

అక్షరటుడే, ఇందూరు: Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​...

Modi Hyderabad Visit | మే 10న భాగ్యనగరానికి మోదీ.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Modi Hyderabad Visit | మే 10 ఆదివారం ప్రధాని...

Train Accident Nizamabad | రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Train Accident Nizamabad | రైలుకింద పడి...

CPI Letter Governor | సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాల్సిందే.. గవర్నర్‌కు సీపీఐ బహిరంగ లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CPI Letter Governor | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై...