అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | తమది దాడులు చేసే కల్చర్ కాదని, అలా అని బీజేపీ (BJP) కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ (Karimnagar)లో గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనాలపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బండి సంజయ్ స్పందించారు. తమది దాడుల సంస్కృతి కాదన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయాలనే ఆలోచన లేదని కార్యకర్తలు చెప్పారన్నారు. ఆ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని చెప్పారు. తాను ఆ సమయంలో సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నానని తెలిపారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్యాంప్ ఆఫీస్‌లో ప్రెస్మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడటం కూడా తప్పేనన్నారు.
Bandi Sanjay | సహనానికి హద్దు
తమ కార్యకర్తల సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దానిని పిరికితనంగా భావించొద్దని సూచించారు. దాడుల కల్చర్ తీసుకు వచ్చిందే బీఆర్ఎస్ (BRS) పార్టీ అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, పదవి ఉన్నప్పుడు హద్దులో ఉండాలని సూచించారు. గతంలో కేటీఆర్ సిరిసిల్లకు పోతే బీజేపీ, ఏబీవీపీ (ABVP) కార్యకర్తలను హౌజ్ అరెస్ట్ చేసే వారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాచరిక పాలన ఉండేదన్నారు.
Bandi Sanjay | ప్రతీకారం తీర్చుకోవడం లేదు
తాను ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) చేపట్టినప్పుడు అనేక దాడులు చేశారని బండి సంజయ్ అన్నారు. అయితే దానికి తాము ప్రతీకారం తీర్చుకోవడం లేదన్నారు. తాజాగా కార్యకర్తలు చేసిన దాడిని తాను సమర్థించడం లేదని తెలిపారు. దాడుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. దాడులకు దూరంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.
Live : Addressing the Media in Hyderabad https://t.co/JslkU3ldPl
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 7, 2026
దీనిని కూడా చదవండి : Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

