Nida Khan Arrest | ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన TCS వంచకి నిదా ఖాన్

Naresh Chandan
Nida Khan Arrest

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nida Khan Arrest | నాసిక్‌లో సంచలనం రేపిన TCS కన్వర్షన్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌ను Nashik Police అదుపులోకి తీసుకున్నారు.

Nida Khan Arrest | శంభాజీనగర్ ప్రాంతంలో

పోలీసుల వివరాల ప్రకారం.. TCS ఉద్యోగిగా పనిచేస్తున్న నిదా ఖాన్‌ను శంభాజీనగర్ ప్రాంతంలో నాసిక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెపై కీలక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

మత మార్పిడి..

ఈ కేసులో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరిపినట్లు, అలాగే మత మార్పిడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డియోలాలి, ముంబై నాకా పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లలో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఒక ఆపరేషన్స్ మేనేజర్ కూడా ఉన్నారు.

ఫిర్యాదుల ప్రకారం.. బాధిత మహిళలను బెదిరించడం, పబ్లిక్‌గా అవమానించడం, ప్రతికూల వర్క్‌ప్లేస్ రిపోర్టులు ఇవ్వడం, మత భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. నిందితురాలు ఖాన్ పై హిందూ దేవతల మీద అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.. నిందితురాలిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Nashik BPO Case | టీసీఎస్​ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. నిందితురాలికి ముందస్తు బెయిల్​ నిరాకరణ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *