Secunderabad Love Murder | ప్రేమ వ్యవహారం.. బీటెక్​ విద్యార్థి దారుణ హత్య

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Secunderabad Love Murder | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని సికింద్రాబాద్​లో దారుణం చోటు చేసుకుంది. ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడిని ఆమె బంధువులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చారు.

జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యవన్​ అనే యువకుడు బీటెక్​ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడు నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి (Seethaphalmandi) ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పలుమార్లు అతడిని హెచ్చరించారు. అయితే వారి మాటలు పట్టించుకొని యవన్​ సీతాఫల్‌మండి ప్రాంతంలో ఉండే తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తరచూ యువతిని కలుస్తున్నాడు.

Secunderabad Love Murder | కుటుంబ సభ్యుల ఆందోళన

యువతి కుటుంబ సభ్యులు గురువారం రాత్రి బైక్​లపై వచ్చి చిలకలగూడలో యవన్​పై దాడి చేశారు. కత్తులతో పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మొత్తం 8 మంది బైక్​లపై వచ్చి అతడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యువతి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం యవన్​ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్​ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Secunderabad Love Murder | నిందితుల గుర్తింపు

చిలకలగూడ (Chilakalguda) హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. యవన్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో గుర్తించినట్లు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పేర్కొన్నారు. కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరికొందరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Malkajgiri CP Sumathi | డ్రగ్స్​ కట్టడికి డ్రోన్​లతో నిఘా.. మల్కాజ్​గిరి సీపీ సుమతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *