Digital Census Telangana | రాష్ట్రంలో డిజిటల్​ విధానంలో జనగణన..: ఆర్డీవో ప్రభాకర్​

Shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Digital Census Telangana | రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనగణన పూర్తి డిజిటల్ (Digital Census Telangana)​ విధానంలో జరుగుతోందని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్​ తెలిపారు. పట్టణంలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సెల్ఫ్​ ఎన్యూమరేన్​ ర్యాలీని (Self Enumeration Drive) శుక్రవారం ఆయన ప్రారంభించారు.

Digital Census Telangana | స్వీయ నమోదు విధానంలో..

ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభాకర్ (RDO Prabhakar) మాట్లాడుతూ ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో (Digital Population Survey) నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నమోదు విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు, వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదు పూర్తయ్యాక ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు మొబైల్‌కు వచ్చే ఓటీపీని అందజేస్తే వివరాలను ధృవీకరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. తప్పుల్లేని సమాచారం అందించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

Digital Census Telangana | ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి

మున్సిపల్ కమిషనర్ (Yellareddy Municipality) జగ్జీవన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలంతా ఈ డిజిటల్ జనగణన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ వివరాలను సకాలంలో, సరిగ్గా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సందేహాలుంటే వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎంపీడీవో తాహెరా బేగం, ఎంపీవో ప్రకాష్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు సిద్ది శ్రీధర్, చంద్రయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు మంచిర్యాల విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు శివానందం, పప్పు వెంకటేశం, మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబు, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, వార్డు అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి స్వీయ జనగణనపై అవగాహన కల్పించారు.

ఇది కూడా చదవండి: Secunderabad Love Murder | ప్రేమ వ్యవహారం.. బీటెక్​ విద్యార్థి దారుణ హత్య

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *