అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLA Bode Prasad | కృష్ణా జిల్లా (Krishna District)లో ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు బస్టాప్‌లో వేచి చూస్తున్నప్పటికీ బస్సు ఆపకుండా వెళ్లిపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా కంకిపాడు (Kankipadu) సినిమా హాల్ సెంటర్‌లోని బస్టాప్ వద్ద పలువురు ప్రయాణికులు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆగకుండా నేరుగా ముందుకు వెళ్లిపోయింది. అదే సమయంలో తన కారులో అక్కడి నుంచి వెళ్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ ఘటనను గమనించారు.
MLA Bode Prasad | ఓవర్‌టేక్ చేసి మరి..
ప్రయాణికులను పట్టించుకోకుండా బస్సు వెళ్లిపోవడంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, తన కారుతో బస్సును ఓవర్‌టేక్ చేసి అడ్డంగా నిలిపివేశారు Bode Prasad . అనంతరం బస్సులోకి ఎక్కి డ్రైవర్, కండక్టర్‌ను ప్రశ్నించారు. “బస్టాప్‌లో ప్రజలు ఎదురుచూస్తుంటే బస్సు ఎందుకు ఆపలేదు?” అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే, కొందరు ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. బస్సులో సీట్లు ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకు ఆపలేదు? ఒకవేళ సీట్లు లేకపోయినా ప్రజలు నిల్చునే ప్రయాణిస్తారు. మీరు బస్సులు ఆపకపోతే ప్రజలు ప్రభుత్వాన్నే తప్పుబడతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLA Bode Prasad | ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గోసాల
ఇలాంటి ఫిర్యాదులు కేవలం ఒక్కచోట మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్టీసీ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డ్రైవర్, కండక్టర్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. తాను స్వయంగా ఈ ఘటనను చూసినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తుంటే, మీరు బస్సులు ఆపకపోతే ఆ పథకం ప్రయోజనం ఏముంటుంది? అని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గోసాల సెంటర్ వరకు అదే బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ప్రభుత్వ ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి గట్టిగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Kadapa Hotel Incident | శృంగారంలో అపశృతి.. విలేకరి నాలుక కొరికిన మహిళ

