Chicken Price Hike | మాంసం ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన చికెన్​ ధరలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chicken Price Hike | రాష్ట్రంలో చికెన్​ ధరలు భారీగా పెరిగాయి. ఎండలు మండుతుండటంతో కోళ్లఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో డిమాండ్​కు తగినట్లు సప్లై లేక రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

వేసవి కావడంతో పలు నగరాలలో చికెన్​ ధరలు భారీగా పెరిగాయని చికెన్​ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. గత ఆదివారం హైదరాబాదు (Hyderabad)లో స్కిన్​లెస్​ చికెన్​ కిలోకు రూ.260 నుంచి రూ.280 వరకు ఉండగా.. తాజాగా ఆ రేటు రూ.340కి పెరిగింది. ఐదు రోజుల వ్యవధిలోని రూ.80 వరకు ధర పెరగడం గమనార్హం. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Chicken Price Hike | పెళ్లిళ్ల సీజన్​

ప్రస్తుతం రాష్ట్రంలో శుభకార్యాల సందడి నెలకొంది. పెళ్లిలతో పాటు గృహ ప్రవేశాలు, ఇతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో ఇంట్లో చిన్న చిన్న పండుగులను సైతం ప్రజలు ఇప్పుడే చేసుకుంటున్నారు. మరోవైపు పలు గ్రామాల్లో జాతరలు, ఉత్సవాలు మే నెలలో జోరుగా సాగుతాయి. ఈ క్రమంలో చికెన్​ రేట్లు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ (Telangana)లో శుభకార్యం అంటే మాంసం ఉండాల్సిందే. దీంతో పెరిగిన రేట్లతో చికెన్​ ఎలా కొనేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: BC Caste Renaming|తెలంగాణలో పలు బీసీ కులాల పేర్లు మార్పు.. కొత్త పేర్ల జాబితా ఇదే!

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *