నిజామాబాద్Red Cross Services | సమాజసేవలో రెడ్​క్రాస్​ సంస్థ ముందుంటుంది..

Red Cross Services | సమాజసేవలో రెడ్​క్రాస్​ సంస్థ ముందుంటుంది..

సమాజసేవలో నిజామాబాద్​ రెడ్​క్రాస్​ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సంస్థ ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు పేర్కొన్నారు. రెడ్‌క్రాస్, ప్రపంచ తలసేమియా డేను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Red Cross Services | సమాజసేవలో నిజామాబాద్​ రెడ్​క్రాస్​ సంస్థ (Nizamabad) సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం (World Red Cross Day), ప్రపంచ తలసేమియా (Thalassemia) డేను పురస్కరించుకుని రెడ్‌క్రాస్ సొసైటీలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

Red Cross Services | మానవ సేవే.. మాధవ సేవ..

ముందుగా రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డూనంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ.. మానవ సేవే మహోన్నత సేవ అని రెడ్​క్రాస్​ బలంగా నమ్ముతుందన్నారు. తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమని, ప్రతిఒక్కరూ స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన పెంపొందించుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా బాల్​భవన్‌లో (Bal Bhavan) నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Red Cross Services | తలసేమియా బ్లడ్​ ట్రాన్స్​ఫ్యూషన్​ సెంటర్​లో..

అనంతరం రెడ్‌క్రాస్ తలసేమియా (Thalassemia Awareness) బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ సెంటర్‌లో (Blood Transfusion Center) తలసేమియా బాధిత చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ 87వసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో కోశాధికారి కరిపే రవీందర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు, డివిజన్ ఛైర్మన్ డాక్టర్​ శ్రీశైలం, మండల ఛైర్మన్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ రాజేష్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బొద్దుల రామకృష్ణ, రెడ్‌క్రాస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

red1 red3

ఇది కూడా చదవండి: TVK Government Formation| గవర్నర్ వైఖరిపై అసహనం.. కోర్టు మెట్లెక్కనున్న విజయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...