Nagpur Assault Case | సవతి తల్లిపై అత్యాచారం.. గర్భవతిని చేసిన యువకుడి అరెస్టు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur Assault Case | మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంచలన ఘటన వెలుగుచూసింది. సవతి తల్లిపై కోపంతో అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన యువకుడి ఉదంతం సంచలనం రేపుతోంది.

Nagpur Assault Case | ఉద్యోగం వచ్చిన మహిళను..

పోలీసుల కథనం ప్రకారం.. వికాస్‌ శ్రీవాస్తవ (55) నాగ్‌పూర్‌ Nagpurలోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 2024లో ఉద్యోగం కోసం వచ్చిన ఓ మహిళ(26 )తో అతడికి పరిచయం ఏర్పడి, వివాహం చేసుకున్నారు. అయితే వికాస్‌ కుమారుడు అక్షత్‌ శ్రీవాస్తవ (21) ఈ పెళ్లిని వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం.

Nagpur Assault Case | గదిలోకి బలవంతంగా ప్రవేశించి..

బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. ఓ సందర్భంలో అక్షత్‌ తన గదిలోకి బలవంతంగా ప్రవేశించి అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. జరిగిన విషయాన్ని తన భర్త వికాస్‌కు చెప్పినా.. కొడుకు భవిష్యత్తు, కుటుంబ పరువు దృష్ట్యా ఆయన పట్టించుకోలేదని వాపోయింది. తదుపరి తాను గర్భవతి కావడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించింది.

ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు అక్షత్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

Inter Board Merger | ఇంటర్​ బోర్డు విలీనం ప్రతిపాదన.. విద్యా సంస్కరణా..? లేక విద్యా వ్యవస్థపై ప్రయోగమా..?

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *