జాతీయంWest bengal | ‘ఎక్స్' బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

West bengal | ‘ఎక్స్’ బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

అక్షరటుడే వెబ్‌డెస్క్: West bengal | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, సువేందు అధికారి శనివారం ఆ రాష్ట్ర మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ఇతర ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సువేందు అధికారితో పాటు దిలీప్ ఘోష్ , మరో నలుగురు నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.

West bengal | ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం..

మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 సీట్లను గెలుచుకుని చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ ఫలితంతో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల అప్రతిహత పాలనకు ముగింపు పలికినట్లయింది. ముఖ్యంగా భబానీపూర్ నియోజకవర్గంలో జరిగిన హోరాహోరీ పోరులో సువేందు అధికారి 73,917 ఓట్లను సాధించగా, మమతా బెనర్జీ 58,812 ఓట్లతో ఓటమి పాలయ్యారు. దాదాపు 15,105 ఓట్ల తేడాతో ఆమె పరాజయం చెందడం గమనార్హం.

West bengal | ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని..

ఓటమి అనంతరం మమతా బెనర్జీ తొలుత రాజీనామా చేయడానికి నిరాకరించారు. ఎన్నికల ఫలితాలు పారదర్శకంగా లేవని, ఇవి “ముందుగా సిద్ధం చేసినవి” అని ఆమె విమర్శించారు. దాదాపు 100 స్థానాల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ప్రజా తీర్పును దోచుకున్నారని ఆమె ఆరోపించారు. తాము బీజేపీతో కాకుండా, ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల సంఘంతోనే పోరాడామని ఆమె మండిపడ్డారు.

West bengal | ‘X’ బయో మార్పుతో ఓటమి అంగీకారం

రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో, మమతా బెనర్జీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) బయోను అప్‌డేట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి” అని ఉన్న హోదాను, తాజాగా “ముఖ్యమంత్రి (15వ, 16వ , 17వ విధానసభ)” అని మార్చారు. అంటే ఆమె తన పదవీకాలాన్ని గత మూడు పర్యాయాలకే పరిమితం చేస్తూ సమాచారం ఇవ్వడం ద్వారా, ప్రస్తుత పరాజయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి: Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay TVK|విజయ్ సీఎం కావడంలో జాప్యం.. టీవీకే కార్యకర్త ఆత్మాహుతి యత్నం

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay TVK| తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న...

Revanth Reddy Govt|కాంగ్రెస్ ప్రభుత్వ ఆయుష్షు సగం అయిపోయింది: జీవన్ రెడ్డి

అక్షరటుడే వెబ్‌డెస్క్:Revanth Reddy Govt|రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని...

Cognizant Layoffs | కాగ్నిజెంట్ ఉద్యోగులను వణికిస్తున్న ‘ప్రాజెక్ట్ లీవ్ ’.. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cognizant Layoffs | అంతటా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ వినియోగం...

Drunk Driving Cases | వారంరోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు.. సీపీ

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ కమిషనరేట్...