నిజామాబాద్Cow Protection Law | గోసంరక్షణకు చర్యలు తీసుకోవాలి: వీహెచ్​పీ, బజరంగ్​దల్​ డిమాండ్​

Cow Protection Law | గోసంరక్షణకు చర్యలు తీసుకోవాలి: వీహెచ్​పీ, బజరంగ్​దల్​ డిమాండ్​

రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని వీహెచ్​పీ, బజరంగ్​దళ్​ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం పోలీస్​ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cow Protection Law | రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని వీహెచ్​పీ (VHP), బజరంగ్​దళ్​ (Bajrang Dal) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు పోలీస్​ అధికారులకు శనివారం వినతిపత్రం అందజేశారు.

Cow Protection Law | గోమాత సకల దేవతాస్వరూపం..

ఈ సందర్భంగా వీహెచ్​పీ, బజ్​రంగ్​దల్​ కార్యకర్తలు మాట్లాడుతూ.. గోమాత (Gau Raksha) సకల దేవతలకు స్వరూపమన్నారు. వేదకాలం నుంచి ఆరాధ్య దేవతగా పూజిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, మానవాళి ఆరోగ్యానికి గోమాత ఆధారమని తెలిపారు. అయితే ప్రస్తుతం విచ్చలవిడిగా గోవులను వధించి (Cow Slaughter Ban) మాంసాన్ని వినియోగిస్తున్నారని, వేలాది టన్నుల గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవును కాపాడాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం 1977లో గో నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ చట్టం తెలంగాణలో(Telanagana) అమలులో ఉందని గుర్తుచేశారు.

Cow Protection Law | రాష్ట్రంలో చట్టంపై నిర్లక్ష్యం..

రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ఆర్టికల్ 48 కూడా గోరక్ష కోసమే ఉన్నాయని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా గోవధ జరుగుతోందన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని, గో ప్రేమికులు, గోరక్ష సంస్థలు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికైనా గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి డివిజన్ (Yellareddy) డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజిరెడ్డి, ఎస్సై రాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్​పీ జిల్లా గో రక్షక్ తులసీదాస్, త్రి ప్రఖండ సంఘటన మంత్రి వినోద్, భరత్, రాజు, పురుషోత్తం, సృజన్, విష్ణు, సందీప్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Saudi Job Scam|సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన.. ‘నన్ను కాపాడండి’ అంటూ సెల్ఫీ వీడియో వైరల్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sand Tipper Accident | ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్.. పలువురికి గాయాలు

అక్షరటుడే, బాన్సువాడ: Sand Tipper Accident | ఓవర్‌లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న...

Signal Free City| హైదరాబాద్‌కు త్రీ-లెవల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

అక్షరటుడే వెబ్‌డెస్క్:Signal Free City|భాగ్యనగరాన్ని సిగ్నల్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ...

Tamil Nadu Government | తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న అనిశ్చితి.. ఇంకా నిర్ణయం తీసుకోని వీసీకే పార్టీ..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu Government | తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై...

West bengal | ‘ఎక్స్’ బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

అక్షరటుడే వెబ్‌డెస్క్: West bengal | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక...