Cognizant Layoffs | కాగ్నిజెంట్ ఉద్యోగులను వణికిస్తున్న ‘ప్రాజెక్ట్ లీవ్ ’.. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cognizant Layoffs | అంతటా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతుండడంతో ఉద్యోగులు వణికిపోతున్నారు. ఏఐ కంపెనీలు కొత్త కొత్త టూల్స్ ప్రవేశపెడుతుండడంతో ఉద్యోగాలకు ఎసరొస్తోంది. దీంతో ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ మార్జిన్లను పెంచుకునేందుకు ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. టీసీఎస్ సుమారు 12,500 మందిని తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది వరకు ఉద్యోగుల్ని తొలగించింది. ఇతర కంపెనీలూ ఇదే బాటలో ఉన్నాయి. తాజాగా కాగ్నిజెంట్ సైతం ఈ జాబితాలో చేరనుందన్న ప్రచారం ఆ సంస్థ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Cognizant Layoffs | 15 వేల వరకు లేఆఫ్‌లు..

అమెరికాలోని న్యూజెర్సీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బహుళజాతి ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ .. భారీ లేఆఫ్ లకు తెరతీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 -15,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ‘ప్రాజెక్ట్ లీప’ కింద 230 మిలియన్ డాలర్ల నుంచి 320 మిలియన్ డాలర్ల వరకు(రూ. 2,200 – రూ. 3,000 కోట్లు) ఉద్యోగ విరమణ ఖర్చులు భరించాల్సి వస్తుందని అంచనా వేస్తోంది. ఉద్యోగ విరమణ పరిహారం 6 నెలల వేతనానికి సమానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏప్రిల్ 29న నాస్‌డాక్ కు సమర్పించిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా సమీప భవిష్యత్తులో ఎన్ని ఉద్యోగాల కోత విధిస్తుందనేది సంస్థ ఆ ఫైలింగ్ లో వెల్లడించలేదు.

Cognizant Layoffs | భారత్ లోనే అధికం..

కాగ్నిజెంట్ సంస్థలో 3.57 లక్షల మందికిపైగా ఉద్యోగులున్నారు. ఇందులో 2.50 లక్షల మందికిపైగా భారత్‌లోనే పనిచేస్తున్నారు. ఇది మొత్తం కాగ్నిజెంట్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 70 శాతం వరకు ఉంటుంది. కంపెనీ భారీగా లేఆఫ్ లు ప్రకటిస్తే భారతీయులే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం ఐటీ సర్కిళ్లలో వ్యక్తమవుతోంది. భారత్‌లో 12 వేల మందిని తొలగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. భారతదేశంలో కాగ్నిజెంట్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం రూ. 15 లక్షల వరకు ఉంది. ఇక ఉద్యోగ విరమణ పరిహారం దాదాపు 6 నెలల వేతనానికి సమానంగా ఉండనుంది. అంటే ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 7.5 లక్షల వరకు ఇచ్చి ఇంటికి పంపించే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: West bengal | ‘ఎక్స్’ బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *