Drunk Driving Cases | వారంరోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు.. సీపీ

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Drunk Driving Cases | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్(Nizamabad Commissionerate)​ పరిధిలోని నిజామాబాద్​, బోధన్(Bodhan), అర్మూర్ డివిజన్ల పరిధిలో పోలీసులు వారంరోజుల పాటు డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 151మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 11మందికి ఆయా న్యాయస్థానాలు జైలుశిక్ష విధించాయి. మిగిలిన వారికి రూ.10,40,000 జరిమానా వేశాయని తెలిపారు.

Drunk Driving Cases | మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సీపీ సూచించారు. డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడితే ఆర్నెళ్లపాటు డ్రైవింగ్​ లైసెన్స్​ సస్పెండ్(Driving License Suspension)​ చేస్తామని హెచ్చరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగితే ఎలాంటి ఇన్సూరెన్స్​ వర్తించదన్నారు.

ఇది కూడా చదవండి: Signal Free City| హైదరాబాద్‌కు త్రీ-లెవల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *