అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandhi Sanjay Case | కరీంనగర్‌లో మైనర్ బాలికపై నెలల తరబడి జరిగిన అత్యాచారానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధిత బాలిక మూడు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా.. బండి సంజయ్‌కు భయపడిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
Bandhi Sanjay Case | హనీట్రాప్ కేసు నమోదు
కానీ, బండి సంజయ్ కొడుకు ఫిర్యాదుతో బాధిత కుటుంబం వెంటనే హనీట్రాప్ కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బండిపై డ్యామేజ్ కంట్రోల్ కోసం బాధిత కుటుంబంపై వెంటనే హనీట్రాప్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో, కేసు పట్టకపోతే మోడీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబం హెచ్చరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చివరికి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసినా, ఆ విషయం బయటకు పొక్కనీయలేదు.
Bandhi Sanjay Case | పేరు తొలగింపు..
ఇదిలా ఉండగా.. రేపు తెలంగాణకు రాబోతున్న ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డుల నుంచి ఎట్టకేలకు బండి సంజయ్ పేరు తొలగించారు. కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడంతోనే పార్టీపై ప్రభావం పడొద్దన్న ఉద్దేశంతో బండి సంజయ్ పేరు తొలగించినట్లు తెలుస్తోంది.
Vijay Tamil Nadu CM | విజయ్ అనే నేను.. తమిళనాడు సీఎంగా రేపు ప్రమాణస్వీకారం

