Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో (Nizamabad City) ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Travels Bus Accident | గోల్​ హనుమాన్​ వద్ద..

నగరంలోని గోల్​హనుమాన్ ​(gol hanuman accident) వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలు గుండారం చిన్నమ్మ(95)ను ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు ఢీకొంది. దీంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. రోడ్డుపై తీవ్ర గాయాలపాలై పడివున్న ఆమెను స్థానికులు స్పందించి వెంటనే 108లో జీజీహెచ్​కు (nizamabad ggh) తరలించారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్​బస్సును సీజ్​ చేసిన నాల్గో టౌన్​ పోలీసులు (4th town police) దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Modi Targets Congress | ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *