అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sand Transport Rules | ఇసుక రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) హెచ్చరించారు. సోమవారం ఐడీవోసీ(IDOC) వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.
Sand Transport Rules | ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలి
కలెక్టర్ మాట్లాడుతూ, ఇసుక రీచ్‌లను(Sand Reach) క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుక కేటాయింపులు జరగాలని, ఇసుక రవాణా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తూ.చా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక వాహనాల రాకపోకలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద టీజీఎండీసీ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Young India Integrated Residential School), జవహర్ నవోదయ విద్యాలయం (Jawahar Navodaya Vidyalaya) భవన సముదాయాల నిర్మాణాలకు అవసరమైన ఇసుక నిల్వలను నిర్దేశిత ఇసుక రీచ్‌ల నుంచి తరలించేందుకు కలెక్టర్ అనుమతించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, మైనింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

