Nizamabad Congress | బండి సంజయ్​ మంత్రి పదవికి రాజీనామా చేయాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Congress | కేంద్రమంత్రి బండి సంజయ్ ​(Union Minister Bandi Sanjay) తన కుమారుడిపై నమోదు అయిన పోక్సో కేసుకు(POCSO Case) బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి(DCC President Nagesh Reddy) డిమాండ్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా ఛైర్మన్ కేశవణుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

Nizamabad Congress | స్నేహం పేరుతో అఘాయిత్యానికి పాల్పడి..

బండి సంజయ్ కుమారుడు భగీరథ్​ మైనర్ బాలికను స్నేహం పేరుతో లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదైందన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ప్రత్యేక దృష్టి పెట్టి డీజీపీతో మాట్లాడి వెంటనే బాలికకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. దేశం కోసం ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు ఒక హిందూ బాలికకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే వెంటనే బండి సంజయ్​ తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Nizamabad Congress | సీఎం ఆదేశాలతో..

డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఓ బాలికపై బండి భగీరథ్​ చేసిన అకృత్యాలపై బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమై ఉండడం వల్లే ఈ కేసు విచారణ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఈ కేసుపై విచారణ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గౌడపు శరత్ కుమార్, ఏఐసీసీ కోఆర్డినేటర్ గన్​రాజ్​, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోషం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవి, జగడం సుమన్, గణేష్, ఆకుల చిన్న రాజేశ్వర్​, పార్థసారథి, కిష్టా గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :ACB Raids | తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *