అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mouni Roy Divorce | ప్రముఖ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోబోతున్నారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని, త్వరలోనే అధికారికంగా విడాకుల ప్రకటన వచ్చే అవకాశముందనే ఊహాగానాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈ వార్తలకు ప్రధాన కారణం వీరి సామాజిక మాధ్యమ ఖాతాల్లో కనిపిస్తున్న మార్పులే. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ (Suraj Nambiar) ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. అంతేకాదు, తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా ఖాతాల నుంచి తొలగించడం అభిమానుల్లో అనుమానాలకు దారి తీసింది. మరోవైపు దిశా పటాని కూడా అతడిని అన్‌ఫాలో చేయడం ఆసక్తికరంగా మారింది.
Mouni Roy Divorce | విడాకులు తీసుకున్నారా..!
బెంగళూరు (Bengaluru)కు చెందిన సూరజ్ నంబియార్ ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. మౌనీ రాయ్‌తో పరిచయం ప్రేమగా మారడంతో 2022లో గోవాలో ఈ జంట అట్టహాసంగా వివాహం చేసుకుంది. బెంగాలీ, మలయాళ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లి అప్పట్లో భారీ చర్చకు దారితీసింది. అయితే వివాహం జరిగిన నాలుగేళ్లకే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తమపై వస్తున్న వార్తలను ఇప్పటివరకు ఈ జంట ఖండించకపోవడం కూడా చర్చకు కారణమైంది. దీంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
Mouni Roy Divorce | పెళ్లి ఫొటోలు తొలగించడం చిన్న విషయం కాదు
సామాజిక మాధ్యమాల్లో అభిమానులు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. “ఇది కేవలం అపోహ మాత్రమే కావచ్చు” అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, “పెళ్లి ఫోటోలు తొలగించడం చిన్న విషయం కాదు” అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మౌనీ రాయ్ సినీ కెరీర్ పరంగా మాత్రం బిజీగానే కొనసాగుతున్నారు. ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ పాత సూపర్ హిట్ గీతం ‘రగులుతోంది మొగలిపొద’ను కొత్తగా మళ్లీ రూపొందిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమాల్లోకి రాకముందు మౌనీ రాయ్ టెలివిజన్ రంగంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘నాగిన్’, ‘దేవోంకా దేవ్ మహాదేవ్’ వంటి ధారావాహికలతో దేశవ్యాప్తంగా మంచి అభిమానులను సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి..: Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామన్ దుర్మరణం

